Haity: హైతీలో కూలిన విమానం... ఆరుగురి మృతి!

Six Dead in Flight Accident in Hathi
షార్ట్స్‌లో చూడండి
హైతీ రాజధాని పోర్ట్ యూ ప్రిన్స్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ మిషనరీ సభ్యులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది. నగరంలోని ఎయిర్ పోర్టు నుంచి నిన్న సాయంత్రం గం. 6.57 లకు బయలుదేరిన విమానం, ఓ గంట తరువాత హైతీ దక్షిణ తీరంలో కూలిపోయిందని ఎన్సీఏఓ (నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఆరుగురితో వెళుతున్న విమానం కూలిపోగా, అందరూ మృత్యువాత పడ్డారని పేర్కొంది. విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపింది.

Go Back to Shorts
Haity
Filght
Accident
Died

More Telugu News