ఏపీ ప్రాజెక్టులు అక్రమం... ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం: సీఎం కేసీఆర్

CM KCR comments on AP projects
  • నీటి అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • ఏపీ తీరుపై తీవ్ర అసంతృప్తి
  • ఎన్జీటీ స్టే ఇచ్చినా పనులు జరుపుతోందని ఆరోపణ
  • కేఆర్ఎంబీ భేటీ రద్దు చేయాలని వ్యాఖ్యలు
నీటి కేటాయింపులు లేకుండానే, పర్యావరణ అనుమతులు రాకుండానే ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ తీరు అక్రమం అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రాజెక్టుల పనులు జరుగుతూనే వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఒక చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆరోపించారు.

ఇక, జులై 9న నిర్వహించ తలపెట్టిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేసి, జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించి, ఇకపై 50:50 నిష్పత్తిలో పంపకాలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ అజెండాను సిద్ధం చేసి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు పంపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
KCR
Telangana
Andhra Pradesh
Projects

More Telugu News