తెలంగాణలో కొత్తగా 858 మందికి కరోనా
- గత 24 గంటల్లో 1,08,617 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 107 కేసులు
- రాష్ట్రంలో 1,175 మందికి కరోనా నయం
- 9 మంది మృతి
అదే సమయంలో 1,175 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,678 మంది కరోనాతో కన్నుమూశారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,25,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,08,833 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,726 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది.
