TTD: ఆ శ్రీ‌నివాసుడి కృప‌తో జ‌ల‌ వివాదం ప‌రిష్కారం కావాలి: ఏపీ మంత్రి అప్ప‌ల‌రాజు

appala raju vistis ttd
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల మధ్య జల వివాదం తారస్థాయికి చేరుతోన్న విష‌యం తెలిసిందే. ఏపీ నిర్మిస్తోన్న‌ రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తుండ‌డం, పులిచింతల వద్ద‌ విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుండంతో దీనిపై ఏపీ మంత్రి అప్ప‌ల‌రాజు స్పందించారు.  

ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... జ‌ల వివాదం రావ‌డం బాధాక‌ర‌మ‌ని, ఆ శ్రీ‌నివాసుడి కృప‌తో ఈ వివాదం ప‌రిష్కారం కావాల‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన జ‌లాల‌ను గౌర‌వ‌ప్ర‌దంగా సంపాదించుకోవాల‌ని చెప్పారు. వివాదాలు ప‌డ‌డం వ‌ల్ల న‌ష్టాలు ఎక్కువ ఉంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Go Back to Shorts
TTD
appala raju
Andhra Pradesh
Telangana

More Telugu News