వైద్య రంగానికి రూ. 2 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం: మోదీ
- కరోనా సమయంలో వైద్యుల సేవలు అమోఘం
- ప్రజలకు సేవలు అందించడానికి డిజటల్ ఇండియా పథకం దోహదపడింది
- కో-విన్ యాప్ పై ఎన్నో దేశాలు ఆసక్తిని చూపుతున్నాయి
కరోనా సమయంలో లక్షలాది మందికి సేవలు అందించడానికి డిజిటల్ ఇండియా పథకం దోహదపడిందని మోదీ అన్నారు. ఈ పథకంలో భాగంగా అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ముఖ్యమైన డాక్యుమెంట్లను దాచుకోవడానికి డిజిలీకర్, కోవిడ్ ట్రేసింగ్ కోసం ఆరోగ్యసేతు వంటి యాప్ లను ప్రజల ముంగిటకు తీసుకొచ్చామని తెలిపారు. మన దేశం అమలు చేస్తున్న డిజిటల్ సొల్యూషన్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని అన్నారు.
కో-విన్ ఫ్టాట్ ఫామ్ ను అనుసరించేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ సెక్యూరిటీపై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ర్యాంకింగ్స్ లో మన దేశానికి పదో ర్యాంక్ వచ్చిందని తెలిపారు. భారత్ లో డేటా ప్రైవసీ పెరిగిందని చెప్పారు. విద్య నుంచి మందుల వరకు అన్నీ ఆన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.