Pavan kalyan: 'వీరమల్లు' కోసం ఆగ్రా కోట సెట్!

  • మొగల్ కాలం నాటి కథ
  • భారీ సెట్ల కోసం కోట్ల ఖర్చు
  • బందిపోటు పాత్రలో పవన్
  • ప్రియురాలిగా నిధి అగర్వాల్  
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'హరిహర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. పవన్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలను తెరకెక్కించడంలో తన సత్తా చాటుకున్న క్రిష్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగును జరుపుకుంది. కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగు ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇది మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ. అందువలన ఆ కాలం నాటి భారీ సెట్లు వేస్తున్నారు. ఇందుకోసం నిర్మాత ఎ.ఎమ్. రత్నం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని భారీ నిర్మాణాలకు సంబంధించిన సెట్స్ వేశారు. ప్రస్తుతం 'ఆగ్రా కోట' తాలూకు సెట్ వేస్తున్నారట. ఇది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో బందిపోటు పాత్రలో పవన్ నటిస్తుండగా, ఆయన ప్రియురాలిగా నిధి అగర్వాల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమెను మరింత గ్లామరస్ గా కనిపించనుందని అంటున్నారు. ఇక బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా భారీ సంఖ్యలోనే కనిపించనున్నారు.

More Telugu News