రాజకీయాల నేపథ్యంలోనే చరణ్ - శంకర్ సినిమా?
- భారీతనమే శంకర్ సినిమా ప్రధాన లక్షణం
- దిల్ రాజు నుంచి పాన్ ఇండియా మూవీ
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనేది అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ కథ రాజకీయాల నేపథ్యంలో నడవనున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే చరణ్ మాత్రం రాజకీయ నాయకుడిగా కనిపించడట. అయితే అవినీతి రాజకీయాలను అడ్డుకునే పౌరుడిగా కనిపిస్తాడా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లకు రావొచ్చునని చెప్పుకుంటున్నారు.