పోలవరం నిర్వాసితులకు నెలకు రూ. 7,500 చెల్లించాలి: సీపీఎం నేత మధు
- నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యేంత వరకు ప్రాజెక్టు పనులను ఆపేయాలి
- ముంపు గ్రామాలన్నింటికీ ఒకేసారి పునరావాసం కల్పించాలి
- కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి
జులై నుంచి డిసెంబర్ నెల వరకు ముంపుకు గురయ్యే ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7,500 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొండలు, గుట్టలపై నివాసాలు ఏర్పరుచుకున్నవారికి మంచినీరు, ఆహారం, మందులు, టార్పాలిన్లు ఇవ్వాలని చెప్పారు. నిర్వాసితుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని తెలిపారు. నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలని... లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.