టాలీవుడ్ ఎదుర్కొంటోన్న సమస్యలు, కష్టనష్టాల గురించి నాకు తెలుసు: హీరో మంచు విష్ణు లేఖ
- 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీలో విష్ణు
- మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నానని లేఖ
- సినీ పరిశ్రమ నమ్మిన కుటుంబంలో నేను పుట్టాను
- పరిశ్రమకు సేవ చేయడం కర్తవ్యంగా భావిస్తున్నా
'మా' అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నానని మంచు విష్ణు చెప్పారు. తాను సినీ పరిశ్రమ నమ్మిన కుటుంబంలో పుట్టానని పేర్కొన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలు, కష్టనష్టాల గురించి తనకు తెలుసని అన్నారు. తనకు, తన కుటుంబానికి ఎంతో పేరు, ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు రుణపడి ఉన్నామని ఆయన చెప్పారు. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు.
మంచు విష్ణు రాసిన లేఖ ఇదే...