కరోనా వైరస్ ఇప్పటిది కాదు.. 20 వేల ఏళ్ల క్రితమే ముంచెత్తిన మహమ్మారి!
- చైనా, జపాన్, వియత్నాంలలో 20 వేల ఏళ్ల క్రితమే మహమ్మారి విజృంభణ
- అక్కడి ప్రజల డీఎన్ఏలో వైరస్ ఆనవాళ్లు
- వైరస్‌కు అనుగుణంగా జన్యువుల్లో సర్దుబాటు
- ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
గతంలోని కరోనా మహమ్మారులను గుర్తించేందుకు 2,500 మంది జన్యుక్రమాలను అధునాతన విధానాలతో విశ్లేషించగా ఈ విషయం వెలుగుచూసింది. వైరల్ ఇంటరాక్టింగ్ ప్రొటీన్లను (వీఐపీ) ఉత్పత్తి చేసే 42 జన్యువుల్లో కరోనా వైరస్‌కు అనుగుణంగా సర్దుబాట్లు జరిగినట్టు గుర్తించారు. జన్యువుల్లో మార్పులు చోటుచేసుకున్న వారందరూ తూర్పు ఆసియా దేశాల వారే కావడం గమనార్హం. దీనిని బట్టి ఈ దేశాలకు చెందిన పూర్వీకులు 20 వేల ఏళ్ల క్రితమే కరోనాకు గురైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.