అలీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రభాస్

25-06-2021 Fri 18:43
  • అలీ బ్యానర్లో ఫస్టు సినిమా
  • దర్శకుడిగా శ్రీపురం కిరణ్ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా రాకేశ్ పరిచయం
  • త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు  
Prabhas Said All The Best to Andaru Bagundali Andulo Nenundali Team

హాస్యనటుడిగా అలీ సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అలాంటి అలీ నిర్మాతగా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని ఒక సినిమాను నిర్మించాడు.. ఆ సినిమా పేరే 'అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి'. శ్రీపురం కిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అలీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మౌర్యాని .. మంజుభార్గవి .. పవిత్ర లోకేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడారు.

"అలీ గారి ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తోంది .. ఇందులో మంచి మెసేజ్ ఉంది. ఏఆర్ రెహ్మాన్ దగ్గర పనిచేసిన రాకేశ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆల్రెడీ మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా, తెలుగులో కూడా కచ్చితంగా బాగుంటుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. 'అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి .. మనందరం థియేటర్లలో ఉండాలి" అన్నారు. కాగా, సోషల్ మీడియాలో ఆకతాయిల వలన అమాయకులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేదే ఈ సినిమా కథ.