ఎలక్ట్రిక్ టూవీలర్ల ధర తగ్గించిన హీరో
- ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కేంద్రం ప్రోత్సాహం
- రాయితీలు పెంచిన వైనం
- రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు
- పలు మోడళ్ల ధరలు సవరించిన హీరో
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను కేంద్రం రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 1 కిలోవాట్ అవర్ కు రూ.10 వేలు రాయితీ ఇస్తుండగా, ఫేమ్-2లో భాగంగా దాన్ని రూ.15 వేలకు పెంచారు. అంతేకాదు, వాహనం ధరలో 20 శాతం వరకు అందించే సబ్సిడీని కూడా 40 శాతానికి పెంచారు. ఈ నేపథ్యంలోనే హీరో సంస్థ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.