Sonu Sood: గాళ్ ఫ్రెండ్ ఐఫోన్ కావాలంటోందని విజ్ఞప్తి చేసిన నెటిజన్... ఫన్నీగా స్పందించిన సోనూ సూద్ 

Netizen asks Sonu Sood iPhone for his girl friend
షార్ట్స్‌లో చూడండి
సాయం కావాలని అడగడమే తరువాయి, తన శక్తిమేర సాయపడుతూ ఆపద్బాంధవుడిలా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ కు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విచిత్రమైన అభ్యర్థనలు ఎదురవుతుంటాయి.  అలాంటి వాటి పట్ల ఆయన చాలావరకు సరదాగా స్పందిస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ తన గాళ్ ఫ్రెండ్ ఐఫోన్ కావాలంటోందని, మీరు సాయం చేయగలరా? అంటూ సోనూ సూద్ కు ట్వీట్ చేశాడు. దానికి సోనూ సూద్ ఇచ్చిన రిప్లయ్ ఏంటో చూడండి! "నాకు ఆ విషయం తెలియదు కానీ, నీ గాళ్ ఫ్రెండ్ కు నేను ఫోన్ ఇస్తే ఇక నీకెలాంటి ప్రయోజనం ఉండదు!" అని కొంటెగా బదులిచ్చారు. ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Sonu Sood
Netizen
iPhone
Girl Friend
Social Media

More Telugu News