AIIMS: థర్డ్‌ వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండకపోవచ్చు: ఎయిమ్స్‌-డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనం

  • పిల్లల్లో అధిక సీరోపాజిటివిటీని గుర్తించిన అధ్యయనం
  • 5 రాష్ట్రాల్లో 10 వేల మందిపై సీరో సర్వే
  • వయోజనులతో సమానంగా పిల్లల్లో సీరోపాజిటివిటీ
Third wave may nor affect children sevrerly says AIIMS WHO Survey

దేశంలో థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని.. పిల్లలపై దాని ప్రభావం అధికంగా ఉండబోతోందంటూ అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)-ఎయిమ్స్‌(ఢిల్లీ) కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది.

మొత్తం ఐదు రాష్ట్రాల్లో 10 వేల మందిపై సీరో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం 4,509 మందికి సంబంధించిన ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. వీరిలో 700 మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు కాగా.. 3,809 మంది 18 ఏళ్ల పైబడినవారు. వీరిలో సగటు వయసు ఢిల్లీ అర్బన్‌లో 11 ఏళ్లు, ఢిల్లీ రూరల్‌లో 12 ఏళ్లు, భువనేశ్వర్‌లో 11 ఏళ్లు, గోరఖ్‌పూర్‌లో 13 ఏళ్లు, అగర్తలాలో 14 ఏళ్లుగా ఉంది. మార్చి 15, జూన్‌ 10 మధ్య నమూనాలు సేకరించారు.

పిల్లల్లో సార్స్‌-కొవ్‌-2 సీరో-పాజిటివిటీ ఎక్కువగా ఉందని.. వయోజనులతో పోలిస్తే సమానంగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏ వేరియంట్‌ వల్లనైనా భవిష్యత్తులో థర్డ్‌ వేవ్‌ వస్తే దాని ప్రభావం పిల్లలపై మాత్రమే అధిక ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది.

More Telugu News