మిస్టర్ కేటీఆర్... నీ అధికారం, అక్రమ సంపాదన శాశ్వతం కాదని తెలుసుకో: కోమటిరెడ్డి
- నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
- సమాచారం అందించలేదన్న కోమటిరెడ్డి
- స్థానిక ఎంపీనైన తనను పట్టించుకోలేదని ఫైర్
- కేటీఆర్ రాజ్యాంగం చదువుకోవాలని హితవు
"మిస్టర్ కేటీఆర్... నీ అధికారం, నీ హోదా, నీ అక్రమ సంపాదన ఏదీ శాశ్వతం కాదన్న సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జీవితాంతం నీ వెంటే ఉంటాయని అనుకోవద్దు. ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటావని, నీ పంథా మార్చుకుంటావని ఆశిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను గౌరవించడం ఎలాగో దయచేసి నేర్చుకో" అంటూ హితవు పలికారు.