ఆనందయ్యకు వల వేస్తే పడలేదు.. ఇప్పుడు సోనూసూద్ కు గాలం వేశాడు: విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు

15-06-2021 Tue 11:27
  • నిస్వార్థ సేవా కార్యక్రమాలతో సోనూసూద్ మంచి పేరు తెచ్చుకున్నారు
  • ఆయ‌న‌ సంపాదించుకున్న పేరు కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్
  • త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియక పోదు
  • ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ
vijay sai reddy slams tdp

క‌రోనా రెండో వేవ్ విజృంభణ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప్ర‌తినిధులు, ప‌లు రంగాల నిపుణుల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల‌ వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఇందులో సినీన‌టుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ చంద్ర‌బాబుపై సెటైర్ వేశారు.

'ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వల వేస్తే పడలేదు. ఇప్పుడు సోనూ సూద్ కు గాలం వేశాడు. నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ఆయన  సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్. త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియక పోదు. ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ' అంటూ విజ‌యసాయిరెడ్డి చుర‌క‌లంటించారు.