Corona Virus: ఏపీలో కొత్తగా 6,770 కరోనా పాజిటివ్ కేసులు

Corona positive cases in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 1,02,876 కరోనా పరీక్షలు చేపట్టగా... 6,770 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క తూర్పు గోదావరి (1,199) జిల్లాలో తప్ప, మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యి లోపే కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 248 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో 12,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 58 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,09,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,12,267 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 85,637 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 11,940కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
New Cases
Andhra Pradesh
Update
Second Wave

More Telugu News