Piyush Goyal: శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ దంప‌తులు

piyush vistits ttd
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దంప‌తులు ఈ రోజు ఉద‌యం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంత‌కుముందు పీయూష్ గోయ‌ల్ దంప‌తుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి స్వాగ‌తం ప‌లికారు.

కాగా, పీయూష్ దంప‌తులు తిరుచానూరు అమ్మవారిని కూడా ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా పీయూష్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ‌వారిని దర్శించుకుంటే మ‌న‌సుకు ఆనందంగా ఉంటుందని చెప్పారు.  కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు స్వామివారి క‌రుణ‌ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.






Go Back to Shorts
Piyush Goyal
BJP
TTD

More Telugu News