ఈటల వస్తానంటే ఆహ్వానిస్తాం: వైఎస్ షర్మిల

09-06-2021 Wed 16:37
  • తెలంగాణలో దూకుడు పెంచుతున్న షర్మిల
  • కేసులకు భయపడే ఈటల బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్య
  • టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేవారిపై కేసులు పెట్టడం సాధారణమయిందన్న షర్మిల
Will welcome Etela Rajender says YS Sharmila

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్న ఆమె... టీఆర్ఎస్ వ్యతిరేక శ్రేణులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో షర్మిల మాట్లాడుతూ, కేసులకు భయపడే ఈటల బీజేపీలో చేరుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం పరిపాటి అయిపోయిందని మండిపడ్డారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు ఈటలతో తాము చర్చించలేదని అన్నారు. మరోవైపు వచ్చే నెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా తమ పార్టీని షర్మిల అధికారికంగా ప్రకటించబోతున్నారు.