Amit Shah: రేపు జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ కానున్న సీఎం!

AP CM Jagan to meet Amit  shah Tomorrow
  • రెండు రోజుల క్రితమే వెళ్లాల్సి ఉండగా పర్యటన రద్దు
  • తాజాగా అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు సమాచారం
  • షా సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో వెళ్లలేకపోయారు. తాజాగా ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే, కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకోవాలని జగన్ ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రేపటి జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Amit Shah
Jagan
New Delhi
Andhra Pradesh

More Telugu News