Nellore: లైంగిక వేధింపుల ఆరోపణలు.. నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై వేటు

Nellore GGH superintendent transferred to  Tirupati
షార్ట్స్‌లో చూడండి
లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ పై ప్రభుత్వం వేటు వేసింది. సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. ఈ లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వేధింపులపై విచారణ జరిపి, పూర్తి నివేదిక ఇవ్వాలని నిన్న మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

మరోవైపు డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీలు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, నివేదికను ప్రభుత్వానికి అందించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు.
Go Back to Shorts
Nellore
GGH
Superindent

More Telugu News