లోన్ యాప్స్ కేసులో ఈడీ అధికారి లంచావతారం
- సంచలనం సృష్టించిన లోన్ యాప్ ల కిరాతకాలు
- లోన్ యాప్ సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభన
- ఖాతాలు తెరిపించేందుకు ఈడీ అధికారికి లంచం
- బెంగళూరులో రూ.5 లక్షలు అందుకున్న ఈడీ అధికారి
ముంబయికి చెందిన అపోలో ఫిన్ వెస్ట్ లోన్ యాప్ సంస్థ ఎండీ నుంచి ఈడీ అధికారి లలిత్ బజార్డ్ రూ.5 లక్షలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. లోన్ యాప్ కేసులో సీసీఎస్ అధికారులు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు ఈ లంచం ఇచ్చినట్టు వెల్లడైంది. ఈడీ అధికారి లలిత్ పలు బ్యాంకులకు తప్పుడు పత్రాలు ఇచ్చి ఖాతాలు తెరిపించి, డబ్బులు విడుదల చేయించినట్టు తెలుసుకున్నారు.
ఈ లంచగొండి ఈడీ అధికారిపై సీసీఎస్ పోలీసులు సీబీఐకి సమాచారం అందించారు. ఈ క్రమంలో బెంగళూరులో సీబీఐ అధికారులు లలిత్ బజార్డ్ పై కేసు నమోదు చేశారు.