Airindia Plane: క్యాబిన్లో గబ్బిలం... ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

USA bound Airindia plane returns Delhi airport after bat entered into flight cabin
  • ఢిల్లీ నుంచి అమెరికా పయనమైన విమానం
  • టేకాఫ్ తీసుకున్న తర్వాత విమానంలో గబ్బిలం కలకలం
  • 30 నిమిషాలకే తిరిగొచ్చిన విమానం
  • చచ్చిపోయిన గబ్బిలం
  • మరో విమానంలో ప్రయాణికుల తరలింపు
ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న ఓ విమానంలో గబ్బిలం కలకలం సృష్టించింది. క్యాబిన్లో గబ్బిలం కనిపించడంతో విమానాన్ని తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు. గబ్బిలం స్వైరవిహారం చేయడంతో విమానంలో ప్రయాణికులు హడలిపోయారు. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే క్యాబిన్లో గబ్బిలం దర్శనమిచ్చింది. ఆ గబ్బిలం ధాటికి విమాన సిబ్బంది కూడా కకావికలం అయ్యారు.

క్యాబిన్లో గబ్బిలం విషయాన్ని విమాన పైలెట్ ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు తెలపడంతో, వారు తిరిగి రావాలని సూచించారు. దాంతో, టేకాఫ్ తీసుకున్న 30 నిమిషాలకే ఎయిరిండియా బోయింగ్ 737 విమానం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగొచ్చింది. గబ్బిలంపై వన్యప్రాణి విభాగం వారికి సమాచారం అందించగా, వారు వచ్చి పరిశీలించేసరికి అది బిజినెస్ క్లాస్ క్యాబిన్లో చచ్చిపోయిన స్థితిలో కనిపించింది. ఆపై ప్రయాణికులను దింపివేసి విమానాన్ని శుద్ధి చేశారు. ప్రయాణికులను మరో విమానంలో అమెరికా పంపించారు.

విమానంలో గబ్బిలాల వంటి సరీసృపాలు ప్రవేశించడం సాధారణమైన విషయమేనని, క్యాటరింగ్ వంటి ఇతర సర్వీసుల ద్వారా అవి విమానంలోకి వస్తుంటాయని ఎయిరిండియా అధికారి ఒకరు వెల్లడించారు.
Airindia Plane
Bat
New Delhi
USA

More Telugu News