Telangana: వచ్చే నెల 15 నుంచి తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ

from15th june Raitubandhu will be deposited in the accounts of Telangana farmers
  • జూన్ 25వ తేదీలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయండి
  • నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారి పనిపట్టండి
  • అలాంటి వారికి రివార్డులు, ప్రభుత్వ సేవా పతకాలు ఇస్తాం
  • ప్రాజెక్టులతో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేశాం
జూన్ 15 నుంచి 25వ తేదీలోపు రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో రాష్ట్రంలోని మొత్తం 59.25 లక్షల మంది రైతులకు సాయం అందనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ. 5 వేల చొప్పున మొత్తం 7,368 కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ రంగంపై ప్రగతి భవన్‌లో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.

మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గుణాత్మకంగా మార్చివేశామన్నారు. కేసులు వేసి ఆపాలని చూసినా కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగామని కేసీఆర్ అన్నారు. అలాగే, కల్తీ విత్తనాలు, ఎరువులు, నకిలీ పురుగు మందుల విషయంలో ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. కల్తీ ముఠాలను పట్టుకునే వారికి రివార్డులు, ప్రభుత్వ సేవా పతకాలు అందజేస్తామన్నారు.

కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ అధికారులే అవినీతికి పాల్పడి నకిలీ ముఠాలతో జట్టుకడితే సర్వీసు నుంచి తొలగిస్తామని, ఐదేళ్లు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలు విక్రయాలు చేపట్టేలా చూడాలని ఆధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో తొలిసారి క్యూఆర్ కోడ్‌తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాలని ఆదేశించారు. రెండు పంటలకు కలిపి తెలంగాణ రైతులు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారని, ఇది పంజాబ్ కంటే ఎక్కువ దిగుబడని అన్నారు. రాష్ట్రంలో పండుతున్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని సీఎం అన్నారు.
Telangana
KCR
Rythu Bandhu

More Telugu News