నల్లమలలో కెమెరాకు చిక్కిన అరుదైన ‘అడవి రైతు’ పక్షి
- నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన పక్షి
- భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఇండియన్ గ్రేహార్న్
- ఫారెస్ట్ ఇంజినీర్స్ అని కూడా పేరు
ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కు, పొడవైన తోక వుంటాయని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వరరావు, చందంపేట అటవీ అధికారి రాజేందర్ మీడియాకు తెలిపారు. నలుపు, తెలుపు, బూడిద రంగు కలబోతతో ఉండే ఈ గ్రేహార్న్ బిల్ ఎత్తైన చెట్లపైన, అడవిలోని కొండలు, గుట్టలపైనే సంచరిస్తుందని చెప్పారు. అత్తిపండ్లు, పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. ఈ పక్షిని అడవి రైతు, ఫారెస్ట్ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు.