Madhya Pradesh: క్షణంలో తప్పిన భారీ ప్రమాదం.. నడిరోడ్డుపై కూలిన వాటర్ ట్యాంకర్

water tanker collapsed in madhyapradesh video went viral
షార్ట్స్‌లో చూడండి
క్షణాల విలువేంటో తెలిసేది ఇలాంటప్పుడే. రోడ్డుపక్కనున్న ఓ భారీ ట్యాంకర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. అదే సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు క్షణకాలంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు చూస్తుండగానే ఆ భారీ ట్యాంకర్ కుప్పకూలింది. అది తమపై పడబోతోందని గ్రహించిన బైకర్లలో ఒకరు అతి వేగంతో వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకోగా, మరో వ్యక్తి మాత్రం బైక్‌ను అక్కడే పడేసి పరుగులంకించుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని డాటియా జిల్లా పీతాంబర పట్టణంలో జరిగిందీ ఘటన. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనం ట్యాంకర్‌ను ఢీకొట్టడం వల్లే ట్యాంకర్ కూలిందని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Madhya Pradesh
Water Tanker
Viral Videos

More Telugu News