రైతులకు మద్దతుగా.. తన ఇంటిపై న‌ల్ల జెండా ఎగుర‌వేసిన న‌వ్‌జోత్ సింగ్ సిద్ధు.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైతులకు మద్దతుగా.. తన ఇంటిపై న‌ల్ల జెండా ఎగుర‌వేసిన న‌వ్‌జోత్ సింగ్ సిద్ధు.. వీడియో ఇదిగో

navjot singh hoists black flag
  • కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతుల ఆందోళ‌న‌ 
  • ప్ర‌తి పంజాబీ రైతు‌కు మ‌ద్దతు తెల‌పాల‌ని వ్యాఖ్య‌
  • రేపు బ్లాక్ డే పాటించ‌నున్న రైతులు
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. వారికి మ‌ద్ద‌తుగా పంజాబ్‌లోని ప‌టియాలాలోని త‌న ఇంటిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే న‌వ్‌జోత్ సింగ్ సిద్ధు న‌ల్ల‌జెండా ఎగుర‌వేశారు. ప్ర‌తి పంజాబీ రైతు‌కు త‌ప్ప‌నిస‌రిగా మ‌ద్దతు తెల‌పాల‌ని ఆయ‌న కోరారు.

కాగా, కొత్త‌ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా రేపు  బ్లాక్‌ డే పాటించాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. దేశంలోని 40కి పైగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చాగా ఏర్పడి ఈ ఆందోళనను నిర్వహిస్తున్నాయి. రేప‌టి బ్లాక్ డేకు ఇప్ప‌టికే దేశంలో ప‌లువురు ముఖ్య‌మంత్రులు కూడా మ‌ద్దతు ప్ర‌క‌టించారు. అలాగే, వామ‌ప‌క్ష పార్టీల‌తో పాటు ప‌లు పార్టీలు మ‌ద్దతు తెలిపాయి.
navjot singh
punjab
Farm Laws

More Telugu News