సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి న్యాయస్థానంలో హాజరైన అంగ్ సాన్ సూకీ
- ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు
- అప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించని సూకీ
- ఆమెను ఎక్కడ నిర్బంధించారన్న విషయం సూకీకి కూడా తెలియదన్న న్యాయవాది
- అభియోగాలు రుజువైతే 14 ఏళ్ల జైలు శిక్ష
సూకీని నిర్బంధించిన సైన్యం అధికార రహస్యాలను వెల్లడించడం, అక్రమంగా వాకీటాకీలను ఉంచుకోవడం వంటి అభియోగాలను నమోదు చేసింది. ఈ నేరం కనుక రుజువైతే సూకీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయస్థానంలో హాజరైన సూకీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఆమెను ఎక్కడ నిర్బంధించారన్న విషయం సూకీకి కూడా తెలియదని కోర్టుకు తెలిపారు.