వారి ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు: కమలహాసన్
- తమిళనాడు ఎన్నికల్లో కమల్ పార్టీ ఘోర పరాజయం
- పార్టీని వీడిన కీలక నేతలు
- కమల్ సర్వాధికారం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ
- ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానన్న కమల్
తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమల్ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఎన్నికల తర్వాత పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వెళ్తూవెళ్తూ కమల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో కమల్ సర్వాధికారం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీంతో స్పందించిన కమల్.. పార్టీని వీడి వెళ్లే వారు చేసే ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు.