Antibody Cocktail: కరోనా కట్టడికి కొత్త ఔషధం... ధర రూ.59 వేలు

  • భారత మార్కెట్లోకి యాంటీబాడీ కాక్ టెయిల్
  • ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల మిశ్రమం
  • రూపొందించిన రోచ్ ఇండియా, సిప్లా
  • ఒక్క ప్యాక్ ఇద్దరికి సరిపోతుందన్న ఫార్మా సంస్థలు
Roche India and Cipla introduces anti body cocktail in Indian market

కరోనా చికిత్సలో మరో కొత్త ఔషధం రంగప్రవేశం చేసింది. దీన్ని యాంటీబాడీ కాక్ టెయిల్ అంటారు. ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా సంయుక్తంగా దీన్ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో కరోనా బారినపడిన డొనాల్డ్ ట్రంప్ కు ఈ మందునే వాడారు.

ఈ కాక్ టెయిల్ ఔషధంలో రెండు మందులు కలిసి ఉంటాయి. ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల కలయికనే ఈ కాక్ టెయిల్ ఔషధం. భారత మార్కెట్లో 1200 ఎంజీ ఒక డోసు యాంటీబాడీ కాక్ టెయిల్ ను రూ.59,750కి విక్రయించనున్నారు. ఒక్క ప్యాక్ ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు పేర్కొన్నారు.

దీన్ని సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను వాడొచ్చని తెలిపాయి.

More Telugu News