తెలంగాణలో మరో 3,308 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- గత 24 గంటల్లో 63,120 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 513 కొత్త కేసులు
- తెలంగాణ వ్యాప్తంగా 21 మరణాలు
- కరోనా నుంచి కోలుకున్న 4,723 మంది
- పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో ఇప్పటివరకు 5,51,035 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,04,970 మందికి కరోనా నయం అయింది. ఇంకా 42,959 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,106కి చేరింది.
తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.56 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 1.1 శాతంగా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు తెలంగాణలో 91.64 శాతానికి పెరగ్గా, జాతీయస్థాయిలో అది 87.7 శాతంగా ఉంది.