తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 71,616 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు
- అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 18 కేసులు
- రాష్ట్రంలో 27 మంది మృతి
- 5,186 మందికి కరోనా నయం
అదే సమయంలో 5,186 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,36,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,85,644 మంది కోలుకున్నారు. ఇంకా 48,110 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 3,012కి చేరింది.
తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రికవరీ రేటు 90.47 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 85.6 శాతంగా నమోదైంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.56 శాతంగా ఉంది.