Sushil Kumar: ఢిల్లీ కోర్టులో రెజ్లర్ సుశీల్ కుమార్ కు చుక్కెదురు... ముందస్తు బెయిల్ నిరాకరణ

Delhi court denies wrestler Sushil Kumar anticipatory bail
  • జూనియర్ రెజ్లర్ హత్య కేసులో సుశీల్ పై ఆరోపణలు
  • పరారీలో సుశీల్.. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్
  • కోర్టులో వ్యతిరేక ఫలితం
  • సుశీల్ లొంగిపోయే అవకాశాలు
ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, పరారీలో ఉన్న ఒలింపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ సుశీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను ఇక్కడి రోహిణి కోర్టు కొట్టివేసింది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో 23 ఏళ్ల వర్ధమాన రెజ్లర్ సాగర్ ధంకడ్ ను అపహరించి, దాడిచేసి, అతడి మరణానికి కారకుడయ్యాడంటూ సుశీల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా, వారిచ్చిన సమాచారం మేరకు హత్యలో సుశీల్ కుమార్ హస్తం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడిపై లుకౌట్ నోటీసులు, రూ.1 లక్ష రివార్డు కూడా ప్రకటించారు. అయితే, కోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైన నేపథ్యంలో, సుశీల్ కుమార్ స్వయంగా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Sushil Kumar
Bail
Delhi Court
Murder
Sagar Dhankar

More Telugu News