Kangana Ranaut: కరోనా నుంచి కోలుకున్న కంగనా రనౌత్

Kangana Ranaut Says She Tested Negative For
  • ఈ నెల 8న కరోనా బారిన పడిన కంగన
  • కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని ప్రకటించిన బాలీవుడ్ నటి
  • తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని వ్యాఖ్య
బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ కరోనా నుంచి కోలుకుంది. తనకు కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు ఆమె స్వయంగా తెలిపింది. ఈ నెల 8న తనకు కరోనా సోకినట్టు 34 ఏళ్ల కంగన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనాను తాను ఎలా ఎదుర్కొన్నాననే విషయాన్ని చెప్పాలని తనకు ఉన్నప్పటికీ... కోవిడ్ ఫ్యాన్ క్లబ్స్ ను నిరాశపరచాలనుకోవడం లేదని చెప్పింది.

వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే మనను విమర్శించే వారు కూడా ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానించింది. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది.

కరోనా బారిన పడిన తర్వాత కంగన మాట్లాడుతూ, ఇది చిన్ని ఫ్లూ మాత్రమే అయినప్పటికీ... మనుషులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని వ్యాఖ్యానించింది. తాను కరోనాను జయిస్తానని ధీమా వ్యక్తం చేసింది.
Kangana Ranaut
Bollywood
Corona Virus

More Telugu News