హీరో రామ్ కుటుంబంలో విషాదం!

Actor Ram Pothineni grand father dead
  • ఈరోజు కన్నుమూసిన రామ్ తాతయ్య
  • తాతయ్య జీవితం ఒక లారీ డ్రైవర్ గా ప్రారంభమైందన్న రామ్
  • తాత మరణంతో తన హృదయం ముక్కలైందని ఆవేదన
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం నెలకొంది. రామ్ తాతయ్య ఈరోజు కన్నుమూశారు. ఈ సందర్భంగా రామ్ భావోద్వేగంతో ఒక ట్వీట్ పెట్టారు. తన తాతయ్య ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నాడు.

విజయవాడలో ఒక లారీ డ్రైవర్ గా తన తాతయ్య జీవితం ప్రారంభమైందని రామ్ చెప్పాడు. డ్రైవర్ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నాడు. కుటుంబానికి అన్ని వసతులు, సౌకర్యాలను అందించేందుకు ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవారని గుర్తుచేసుకున్నాడు.

డబ్బులు ఉన్న ప్రతి వ్యక్తి ధనవంతుడు కాలేడని... మంచి మనసుతోనే ధనవంతులు అవుతారనే విషయాన్ని మాకు నేర్పించారని చెప్పాడు. మీ పిల్లలందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి మీరే కారణమని తెలిపాడు. మీ మరణం తనను కలచి వేస్తోందని, తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.
Go Back to Shorts
Ram Pothineni
Grand Father
Dead
Tollywood

More Telugu News