Velagapudi Ramakrishna Babu: చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసినందుకు మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

TDP MLA Velagapudi condemns Raghurama Krishna Raju arrest
  • రఘురామ అరెస్ట్ పై స్పందించిన వెలగపూడి రామకృష్ణబాబు
  • అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు వెల్లడి
  • ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆగ్రహం
  • గతంలో జగన్, వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేశారని ఆరోపణ
ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. రఘురామకృష్ణరాజును హైదరాబాదు నివాసంలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు. రఘురామకృష్ణరాజు అరెస్టును ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఇతర వైసీపీ నేతలు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తాము ఎన్నిసార్లు సీఐడీ అరెస్టులు చేయాలి? అని వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులపై పెట్టే దృష్టి కరోనా నియంత్రణపై పెడితే ప్రజల ప్రాణాలనైనా కాపాడేవారేమోనని విమర్శించారు.
Velagapudi Ramakrishna Babu
Raghu Rama Krishna Raju
Arrest
APCID

More Telugu News