Atchannaidu: రఘురామ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారు: అచ్చెన్నాయుడు

TDP AP President Atchannaidu opines on Raghurama Krishnaraju arrest
  • హైదరాబాదులో రఘురామకృష్ణరాజు అరెస్ట్
  • వారెంట్ లేకుండా అరెస్ట్ అక్రమం అన్న అచ్చెన్నాయుడు
  • 'రూల్ ఆఫ్ లా'ను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం
  • జగన్ దమనకాండకు నిదర్శనమని వ్యాఖ్యలు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడీ అరెస్ట్ చేయడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జగన్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని అన్నారు. రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారని విమర్శించారు.

'రూల్ ఆఫ్ లా'ను నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వారెంట్ లేకుండా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడం అక్రమం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన ప్రత్యర్థులపై జగన్ చేస్తున్న దమనకాండకు ఇదొక నిదర్శనం అని తెలిపారు.

ఈ సాయంత్రం హైడ్రామా నడుమ హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో రఘురామకృష్ణరాజును ఏపీసీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. రఘురామ కుటుంబ సభ్యులకు నోటీసులు అందించిన సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసి విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Atchannaidu
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Arrest
APCID

More Telugu News