తమన్నాను తీసుకోలేదని తప్పుకున్న హీరో!
- తమిళంలో హిట్ కొట్టిన 'కో'
- తెలుగులో 'రంగం' టైటిల్ తో రిలీజ్
- ఇక్కడ కూడా భారీ వసూళ్లు
- శింబూ ప్లేస్ లో వచ్చిన జీవా
ఈ సినిమాలో హీరోగా ముందుగా శింబూను అనుకున్నారట. అయితే కార్తీక హీరోయిన్ అయితే తాను చేయననీ, తమన్నాను తీసుకోమని శింబూ చెప్పాడట. తమన్నా డేట్స్ దొరకడం కష్టంగా ఉందనీ, అయినా ఆమె పారితోషికం చాలా ఎక్కువని నిర్మాతలు అయిష్టతను వ్యక్తం చేశారట. దాంతో శింబూనే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఆ తరువాత హీరోగా జీవాను తీసుకోవడం జరిగిందన్న మాట. శింబూతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్న సమయంలోనే, దర్శకుడు కేవీ ఆనంద్ చనిపోవడం జరిగిందని అంటున్నారు.