తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం!
- భైంసాలో మూడు కేసులు
- ఒకరి మరణం, మరో ఇద్దరి పరిస్థితి విషమం
- గాంధీలోనూ మూడు కేసులు
- కొవిడ్ సోకిన అందరికీ బ్లాక్ ఫంగస్ రాదు
- వెల్లడించిన డీఎంఈ రమేశ్ రెడ్డి
ఈ విషయంపై తెలంగాణ వైద్య విద్య విభాగం డైరెక్టర్ రమేశ్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను ప్రైవేటు ఆసుపత్రుల వారు గాంధీకి పంపేందుకు యోచిస్తున్నారని తెలిపారు. కొవిడ్ సోకిన ప్రతిఒక్కరికీ బ్లాక్ ఫంగస్ సోకదని స్పష్టం చేశారు. కొందరు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారన్నారు.