'ఖిలాడి' దర్శకుడితో పవన్ కల్యాణ్?

Ramesh Varma upcoming movie with Pavan kalyan
  • పవన్ తో బండ్లకు సాన్నిహిత్యం
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో సినిమాలు
  • మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా చేస్తానని చెప్పినప్పుడు, ఆ ఒక్క సినిమానే చేస్తాడేమోనని భావించారు. గతంలో మాదిరిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ తన ప్రాజెక్టులను సెట్  చేసుకోవడంలో గతంలో కంటే ఫాస్టుగా ఉన్నారు. ఒక సినిమా చేస్తుండగానే మరో రెండు సినిమాలను సెట్స్ పై ఉంచడం, మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టడం ఇదే మొదటిసారి. పైగా అన్నీ పెద్ద ప్రాజెక్టులే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మరో దర్శకుడికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడి పేరే .. రమేశ్ వర్మ.

పవన్ కల్యాణ్ తో నిర్మాత బండ్ల గణేశ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో పెద్ద సినిమాలే వచ్చాయి. అయితే పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయనతో మరో ప్రాజెక్టును సెట్ చేయడానికి బండ్ల గణేశ్ ప్రయత్నిస్తున్నాడు. రమేశ్ వర్మ దగ్గర మంచి కథ ఉందని తెలిసిన బండ్ల గణేశ్, ఆయనను వెంటబెట్టుకుని వెళ్లాడట. ఆయన వినిపించిన కథ నచ్చడంతో, పవన్ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే హరీశ్ శంకర్ .. సురేందర్ రెడ్డి ప్రాజెక్టులు పూర్తయిన తరువాతనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి' సినిమాతో రమేశ్ వర్మ బిజీగా ఉన్నాడు.
Go Back to Shorts
Pavan Kalyan
Bandla Ganesh
Ramesh Varma

More Telugu News