టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు

07-05-2021 Fri 17:15
  • చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన అడ్వొకేట్ సుబ్బయ్య
  • ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఫిర్యాదు
  • కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటున్నారని ఆరోపణ
  • చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి 
Case filed on Chandrababu in Kurnool

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదును స్వీకరించిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు, చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అటు, చంద్రబాబు లేని వైరస్ ఉందంటూ విషప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు సైతం మండిపడుతున్నారు.