dmk: మ్యాజిక్ ఫిగ‌ర్ దాటిన డీఎంకే.. సంబ‌రాల్లో మునిగితేలుతోన్న కార్య‌క‌ర్త‌లు.. వీడియో ఇదిగో

dmk video goes viral
షార్ట్స్‌లో చూడండి
ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు నిజ‌మ‌వుతున్నాయి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. త‌మిళ‌నాడులో మొత్తం 234 స్థానాలు ఉండ‌గా, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 స్థానాల్లో గెల‌వాలి. డీఎంకే 133, అన్నాడీఎంకే 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

త‌మ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తూ మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌డంతో డీఎంకే నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అప్పుడే సంబ‌రాలు ప్రారంభించారు. ప‌లు చోట్ల బాణ‌సంచా కాల్చుతూ డ్యాన్సు చేస్తున్నారు. కాగా, త‌మిళ‌నాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్‌, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధినేత‌ కమల హాసన్ వారు పోటీ చేసిన స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.
Go Back to Shorts
dmk
Viral Videos
Tamilnadu

More Telugu News