తెలంగాణలో కొన‌సాగుతోన్న‌ కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు.. ఓటు వేసిన ప్ర‌ముఖులు

30-04-2021 Fri 12:23
  • క‌రోనా నిబంధ‌న‌ల మ‌ధ్య  ఎన్నిక‌లు
  • వరంగల్‌ 60వ డివిజన్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓటు
  • అచ్చంపేటలో ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ ఎంపీ రాములు
kadiam casts his vote

క‌రోనా నిబంధ‌న‌ల మ‌ధ్య తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ కొన‌సాగుతోంది. వరంగల్‌ 60వ డివిజన్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మట్టెవాడలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అలాగే, అచ్చంపేటలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు ఓటు వేశారు. అలాగే, ఆయా ప్రాంతాల్లోని ప‌లువురు ప్ర‌ముఖులు ఓట్లు వేసి అంద‌రూ  ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.