IIT Madras: 5 రోజుల్లోనే 3డీ ప్రింటెడ్ ఇల్లు.. ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్

  • 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
  • నిర్మాణ ఖర్చు 30 శాతం తక్కువ
  • జీవితకాలం 50 ఏళ్లకుపైనే
  • ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల ఘనత
Indias first 3D printed house inaugurated at IIT Madras 

దేశంలోనే తొలిసారి ఐఐటీ మద్రాస్ పూర్వవిద్యార్థులు ఐదు రోజుల్లోనే 3డీ ప్రింటెడ్ ఇంటిని నిర్మించి రికార్డు సృష్టించారు. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్‌రూములను అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ విధానంలో నిర్మాణ ఖర్చు 30 శాతం వరకు తగ్గనుండగా, భవన జీవితకాలం 50 ఏళ్లకుపైనే.

ఇంటిని ఆవిష్కరించిన అనంతరం నిర్మల మాట్లాడుతూ.. 2022 నాటికి అందరికీ ఇళ్ల పథకం కింద కోటి గృహాలను నిర్మించడం సవాలుతో కూడకున్న విషయమని, అయితే, ఈ 3డీ ప్రింటింగ్ విధానం ద్వారా అది నెరవేరే అవకాశం ఉందని అన్నారు. కాగా, ఐఐటీ మద్రాస్ పూర్వవిద్యార్థులు రూపొందించిన 3డీ ప్రింటింగ్ నమూనా ఆధారంగా చెన్నైకి చెందిన త్వస్థ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ఈ ఇంటిని ఐదు రోజుల్లోనే నిర్మించడం గమనార్హం.

More Telugu News