YS Sharmila: షర్మిలకు భద్రతను ఉపసంహరించిన తెలంగాణ ప్రభుత్వం!

Telangana government withdraws security for Sharmila
  • రెండు వారాల క్రితం షర్మిలకు 2ప్లస్2 భద్రత
  • ఉద్రిక్తతకు దారితీసిన షర్మిల దీక్ష
  • ఖమ్మం సభలో కేసీఆర్‌పై దుమ్మెత్తి పోసిన షర్మిల
తెలంగాణలో కొత్త పార్టీకి సిద్ధమవుతున్న వైఎస్ షర్మిలకు 15 రోజుల క్రితం ప్రభుత్వం 2ప్లస్2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే, తాజాగా ఆ భద్రతను ప్రభుత్వం ఉపసంహరించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెబుతున్న షర్మిల ఇటీవల పలు జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. నిరుద్యోగులకు మద్దతుగా ఇటీవల షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భద్రతను ఉపసహరించుకున్నట్టు వార్తలు రావడం గమనార్హం.
YS Sharmila
Telangana
Security

More Telugu News