రాణించిన డివిలియర్స్... బెంగళూరు స్కోరు 20 ఓవర్లలో 171/5

 AB deVilliers smashes Delhi Capitals bowling
  • నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ బెంగళూరు
  • తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • డివిలియర్స్ అర్ధసెంచరీ
  • 42 బంతుల్లో 75 పరుగులు చేసిన డివిలియర్స్
  • ఆఖరి ఓవర్లో 23 పరుగులు రాబట్టిన వైనం
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. విధ్వంసక వీరుడు ఏబీ డివిలియర్స్ మరోసారి తన ట్రేడ్ మార్కు బ్యాటింగ్ తో అలరించాడు. డివిలియర్స్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ మార్కస్ స్టొయినిస్ విసరగా, ఆ ఓవర్లో డివిలియర్స్ 3 సిక్సర్లు బాది 23 పరుగులు సాధించాడు.

బెంగళూరు ఇన్నింగ్స్ లో రజత్ పాటిదార్ 31, మ్యాక్స్ వెల్ 25 పరుగులు సాధించారు. కోహ్లీ 12, పడిక్కల్ 17 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ, రబాడా, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
Go Back to Shorts
AB deVilliers
RCB
Delhi Capitals
IPL

More Telugu News