కరోనాతో అల్లాడుతున్న భారత్.. సంఘీభావంగా బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాక ప్రదర్శన
- ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ నినాదం
- కరోనాపై పోరులో భారత్ విజయం సాధిస్తుందన్న యూఏఈ
- వీడియోను షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం
బుర్జ్ ఖలీఫా భవనంపై భారత పతాకాన్ని ప్రదర్శించి యూఏఈ సంఘీభావం తెలిపిందని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. మరోవైపు, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రధాన కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూఏఈ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.