కరోనా మహమ్మారికి బలైన నటి మాలాశ్రీ భర్త!
- వారం రోజుల క్రితం సోకిన కరోనా
- బెంగళూరులో చికిత్స పొందుతూ కొణిగల్ రాము మృతి
- సంతాపం వెలిబుచ్చిన శాండల్ వుడ్
కాగా, తుముకూరు ప్రాంతానికి చెందిన రాము, శాండల్ వుడ్ లో ప్రముఖ నిర్మాతగా ఓ వెలుగు వెలిగారు. దాదాపు 39 చిత్రాలను నిర్మించిన ఆయనకు 'కోటి రాము' అన్న పేరుంది. కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీసినందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన ఆయన, మాలాశ్రీ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే వివాహమాడారు. ఆయనకు ఓ కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. రాము మరణ వార్తను గురించి తెలుసుకున్న కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు వ్యాఖ్యానించారు.