మాస్క్ మాదిరిగా పెయింట్ వేసుకున్న యువతి... పాస్ పోర్ట్ నే సీజ్ చేసిన అధికారులు!
- ఇండొనేషియాలోని బాలీలో ఘటన
- సూపర్ మార్కెట్ కు వచ్చి వీడియోలు
- సీరియస్ గా తీసుకున్న అధికారులు
మరిన్ని వివరాల్లోకి వెళితే, బాలీలో ఉంటున్న జోష్ పాలర్ లిన్, లీయా అనే ఇద్దరు అమ్మాయిలు, మాస్క్ కు బదులుగా, తమ ముఖాలకు సర్జికల్ మాస్క్ మాదిరిగా కనిపించేలా నీలి రంగులో మాస్క్ లు వేసుకుని ఓ సూపర్ మార్కెట్ కు వచ్చారు. ఆపై వీడియోలు తీసుకున్నారు. దీన్ని చూసిన వారు అది మాస్క్ కాదని, పెయింటింగ్ అని పలువురు గుర్తించి ఫిర్యాదు చేశారు. దీంతో ఇండోనేషియా అధికారులు, వారిద్దరి పాస్ పోర్టులను సీజ్ చేశారు.