తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష
- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
- 27వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగింపు
- ఈ నెల 30న పోలింగ్
- మే 3న ఓట్ల లెక్కింపు
నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ర్యాలీలు, సమావేశాలపై నిషేధం ప్రకటించారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిషిద్ధమని వెల్లడించారు. ఈ నెల 27 నాటికి ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.